Breaking news | సాయికృష్ణ కేసులో మరో అరెస్ట్..!
హోంగార్డు అరెస్ట్..!
సీసీ ఫుటేజ్, డీవీఆర్ ధ్వంసం ఆరోపణలు..
సిట్ అదుపులో వెంకటరాజు
Breaking news | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు హోంగార్డు వెంకటరాజును అరెస్ట్ చేశారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం వెంకటరాజును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత అతన్ని కోర్టులో హాజరుపర్చనున్నట్లు అధికారులు తెలిపారు.
కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సాయికృష్ణను తీసుకొచ్చిన సమయంలోని సీసీటీవీ ఫుటేజ్, డీవీఆర్‌ను వెంకటరాజు ధ్వంసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై సిట్ అధికారులు దర్యాప్తు చేపట్టి, ఆధారాల సేకరణలో భాగంగా ఈ అరెస్ట్ చేసినట్లు సమాచారం. కేసులో ఇప్పటికే పలువురు పోలీసుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతుండగా.. తాజాగా హోంగార్డు అరెస్ట్ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సిట్ అధికారులు మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.
