mi vs kkr|ముంబై వర్సెస్ కోల్‌క‌తా

mi vs kkr|ముంబై వర్సెస్ కోల్‌క‌తా

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026లో ఇవాళ బిగ్‌ఫైట్ జ‌ర‌గ‌నుంది. ఐపీఎల్ రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ – కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జ‌ట్లు గ‌త సీజ‌న్‌లో నిరాశ ప‌రిచాయి. ముంబై క్వాలిఫైయర్ 2 వరకూ వెళ్లి వెనుదిరిగింది. ఈ సారి ఐపీఎల్ క‌ప్‌ను ఎలాగైనా కొట్టాల‌ని స్ట్రాంగ్‌గా త‌యారై వ‌చ్చింది. అద్భుత‌మైన‌ బౌలర్లు, బ్యాటర్లతో ఈ ఏడాది జట్టు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కూడా గ‌త సీజ‌న్‌లో దారుణంగా ఆడింది. ఆ జ‌ట్లు అప్పుడు ఎనిమిదో స్థానంలో నిలిచి ప‌రువు పోగొట్టుకుంది. ఐపీఎల్‌లో కోల్‌క‌తాపై ముంబై జ‌ట్టుదే ఆధిప‌త్యం. ఇప్ప‌టివ‌ర‌కు ముంబై ఇండియన్స్ – కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు 35 సార్లు తలపడ్డాయి. అందులో ముంబై ఇండియన్స్ 24 మ్యాచ్‌లలో విజయం సాధించగా, కేకేఆర్ 11 మ్యాచ్‌లలో గెలిచింది. మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు వాంఖడే స్టేడియం వేదికగా ప్రారంభం కానుంది. మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు.

ఇరు జ‌ట్ల అంచనా

ముంబై ఇండియన్స్ : క్వింటన్ డికాక్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రూధర్‌‌ఫోర్డ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రాజ్ బవా, విల్ జాక్స్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, మయాంక్ మార్కండే.

కోల్‌కతా నైట్ రైడర్స్ : ఫిన్ అలెన్, సునీల్ నరైన్, అజింక్య రహానే (కెప్టెన్), కామెరూన్ గ్రీన్, అంగ్‌క్రిష్ రఘువంశీ, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, ఏఎస్ రాయ్, వరుణ్ చక్రవర్తి, బ్లెస్సింగ్ ముజరబానీ

Leave a Reply