వైఎస్సార్‌కు ఘన నివాళులు
77వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల
పెడనలో వైఎస్సార్‌సీపీ నేతల ఘన నివాళులు
పెడన, ఆంధ్రప్రభ: పెడన పట్టణంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి పెడన నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి ఉప్పాల రాము ఘన నివాళులర్పించారు.
అనంతరం పెడన పట్టణంలోని పలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు కూడా ఉప్పాల రాము పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
