HYDRA | బీఆర్‌ఎస్ ఆరోపణలకు శ్రీధర్‌బాబు కౌంటర్

HYDRA | బీఆర్‌ఎస్ ఆరోపణలకు శ్రీధర్‌బాబు కౌంటర్

HYDRA | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గతంలో చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. మీడియాతో మాట్లాడుతూ… పలు అంశాలపై ఆయన స్పందించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హిట్లర్‌, నాజీ సిద్ధాంతాలకు మద్దతు ఇస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని శ్రీధర్‌బాబు ఖండించారు. సీఎం ఎప్పుడూ హిట్లర్ సిద్ధాంతాలను అనుసరిస్తామని చెప్పలేదని స్పష్టం చేశారు. ఏదైనా లక్ష్యాన్ని సాధించే వరకు విరమించకుండా కృషి చేసే వ్యక్తిని ఉదాహరణగా మాత్రమే ప్రస్తావించారు. ఏ పనినైనా పట్టుదలతో పూర్తి చేయాలనే ఉద్దేశంతో సీఎం మాట్లాడారని మంత్రి వివరించారు.

హైడ్రా చర్యలపై వస్తున్న ఆరోపణలను కూడా శ్రీధర్‌బాబు తిప్పికొట్టారు. భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటుండటంతో కొందరు అసహనానికి గురవుతున్నారని వ్యాఖ్యానించారు. హైడ్రా పూర్తిగా రాజ్యాంగం, చట్టాల పరిధిలోనే పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ఆక్రమణలపై చర్యలకు ముందు నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేస్తున్నారని చెప్పారు. హైడ్రా చేపడుతున్న చర్యలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. అయితే ఈ చర్యలు కొందరు బీఆర్‌ఎస్‌ నాయకులకు అసౌకర్యంగా మారుతున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు.

Leave a Reply