Tadicherla-2-Coal-Block : వావ్​ తాడిచర్ల 2 బిగ్​ గిప్ట్​ Andhra Prabha Top Story

Tadicherla-2-Coal-Block : వావ్​ తాడిచర్ల 2 బిగ్​ గిప్ట్​ Andhra Prabha Top Story

  • సింగరేణి నయా యోగం
  • 49 ఏళ్ల బొగ్గు కరవు తీరినట్టే
  • 3000 మందికి ఉసాధి
  • కొత్త ధర్మల్​ స్టేషన్​ ఇక పవర్​ ఫుల్​
  • అందరికీ వందనం
  • తెలంగాణ జనం హర్షం

( ఆంధ్రప్రభ, ఇల్లెందు ప్రతినిధి)

తెలంగాణలోని సింగరేణి కాలరీస్ సంస్థ కు తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ను నేరుగా కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 2020 నుండి నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు అన్ని బొగ్గు గనుల్లోనూ బహిరంగ వేలం విధానాన్ని పాటిస్తున్నారు. అయితే, 2020 తర్వాత ఒక ప్రభుత్వ రంగ సంస్థకు వేలం లేకుండా (నామినేషన్ పద్ధతిలో) నేరుగా గనిని కేటాయించడం ఇదే మొదటిసారి. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్ని న్యాయపర సలహాలు తీసుకున్న తర్వాత ఈ ఫైల్‌పై సంతకం చేశారు.

Tadicherla-2-Coal-Block : ప్రభుత్వం దౌత్యం ఫలితం

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వంతో ప్రధాని నరేంద్ర మోదీతో జరిపిన నిరంతర చర్చల వల్లనే ఇది సాధ్యపడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఈ ఓపెన్ కాస్ట్-2 బొగ్గు బ్లాక్ తెలంగాణకు ఎంతో కీలకం. ఈ బ్లాక్‌లో దాదాపు 434.14 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉండగా, అందులో 340 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీయవచ్చు. ఏటా 10 మిలియన్ టన్నుల చొప్పున వచ్చే 40 నుండి 50 సంవత్సరాల పాటు ఇక్కడి నుండి నిరంతరాయంగా బొగ్గును ఉత్పత్తి చేయవచ్చు. ఈ బ్లాక్ ద్వారా సింగరేణికి రూ.64,000 కోట్ల ఆదాయం రానుండగా, రాయల్టీల రూపంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.16,000 కోట్ల ఆదాయం సమకూరుతుంది. వేలం లేకుండా నేరుగా కేటాయించడం వల్ల ప్రీమియం ఖర్చుల రూపంలో సింగరేణి సంస్థకు రూ.2,500 కోట్ల నుండి రూ.3,000 కోట్ల వరకు అదనపు భారం తగ్గింది. కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ వంటి రాష్ట్ర విద్యుత్ కేంద్రాలకు నాణ్యమైన (G-9 గ్రేడ్) బొగ్గు దీర్ఘకాలికంగా అందుబాటులో ఉంటుంది. ఈ మైనింగ్ ప్రాజెక్ట్ ద్వారా స్థానికంగా దాదాపు 3,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుంది.

Tadicherla-2-Coal-Block : మాజీ సీఎండీ బలరామ్ విజన్​

సింగరేణి సంస్థ విస్తరణలో పర్యావరణ పరిరక్షణలో మాజీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బలరామ్ చేసిన కృషి ఎంతో ప్రశంసనీయం , ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్‌లో 340 మిలియన్ టన్నుల నిల్వలు ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన పర్యావరణ, అటవీ అనుమతులను సాధించి, అక్కడ మైనింగ్ పనులు ప్రారంభించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇదే కాకుండా కర్ణాటకలో బంగారం, రాగి అన్వేషణ లైసెన్సులు సాధించడంలో ఆయన కృషి ఉంది. సింగరేణి సంస్థ ఆర్థిక వృద్ధి, కార్మికుల సంక్షేమం చ కొత్త థర్మల్, సోలార్ ప్రాజెక్టుల ఒప్పందాల వెనుక ఆయన ప్రణాళికలు ఉన్నాయి. తాడిచర్ల-2 కేటాయింపుతో సింగరేణి వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 100 మిలియన్ టన్నులకు చేరుకోవడానికి మార్గం సుగమమైంది.

Tadicherla-2-Coal-Block : థ్యాంక్యూ వెరీ మచ్​

తెలంగాణ సింగరేణి అభివృద్ధి కోసం తాడిచర్ల- 2 బొగ్గు బ్లాక్
తెలంగాణ అభివృద్ధికి ఎంతో కీలక తాడిచర్ల – 11 బొగ్గు బ్లాక్ ను వేలం ప్రక్రియ లేకుండా సింగరేణికి కేటాయించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కి సింగరేణి సీఎండీ ఎస్సీసీఎల్ ఎన్.బలరామ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాను సింగరేణి సీ అండ్ ఎండీగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో తెలంగాణలోని ఈ అత్యంత కీలకమైన బొగ్గు బ్లాక్ ను సింగరేణికి కేటాయించాల్సిన అవసరాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి, అందుకు అవసరమైన స్థాయిలో నిరంతర కృషి చేశాను. నేడు వేలం ప్రక్రియ లేకుండా తాడిచర్ల – 11 బొగ్గు బ్లాక్ సింగరేణికి కేటాయించడం ఆనాటి ఆ ప్రయత్నాలకు దక్కిన సార్థక ఫలితంగా
భావిస్తున్నానన్నారు.

ఈ బొగ్గు బ్లాక్ రానున్న 40-50 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి,సింగరేణి సంస్థ బలోపేతానికి, వేలాది మంది కార్మికులు, ఉద్యోగుల ఉపాధి భద్రతకు ఎంతో దోహదపడనుంది. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులకు, ఉద్యోగులకు, అధికారులకు, సింగరేణి ప్రాంత ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. ఈ ప్రయత్నానికి సహకరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కు హృదయపూర్వక కృతజ్ఞతలు.