Meeting | ఆశావహులతో కవిత కీలక భేటీ

Meeting | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో త్వ‌ర‌లో జ‌రుగ‌బోయే మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి నేత‌లు బ‌రిలో దిగుతార‌ని క‌విత స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఇవాళ‌ హైదరాబాద్ లోని త‌మ నివాసంలో క‌విత‌ ఆశావ‌హుల‌తో భేటీ అయ్యారు. ఎన్నిక‌ల్లో రచించాల్సిన వ్యూహాలు, ఇత‌ర అంశాల‌పై క‌విత చ‌ర్చిస్తున్నారు. కాగా ఈ ఎన్నిక‌ల్లో నిజామాబాద్ లో 20 నుండి 30 స్థానాల్లో జాగృతి అభ్య‌ర్థులు బ‌రిలో దిగ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. నోటిఫికేష‌న్ రాక‌ముందే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేలా క‌విత క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

Leave a Reply