అనుమానాస్పద స్థితిలో ఎలుగుబంటి మృతి

మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ: మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో శుక్రవారం అనుమానాస్పద స్థితిలో ఎలుగుబంటి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.

మండల పరిధిలోని ఝాన్సీ లింగాపూర్ పంచాయతీకి చెందిన సదాశివనగర్ తండా సమీపంలో ఎలుగుబంటి మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎలుగుబంటి మృతికి గల కారణాలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.