MDK | విద్యార్థులే కేంద్రంగా విద్యాబోధన జరగాలి… మను చౌదరి

ఉమ్మడి మెదక్ బ్యూరో : విద్యార్థులే కేంద్రంగా విద్యా బోధన జరగాలని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి అన్నారు. గురువారం కోహెడ మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… 50లక్షల రూపాయలతో శనిగరం, కోహెడ, అంతక్కపేట జెడ్పి హైస్కూల్ లలో ల్యాబ్ ను ఏర్పాటు చేసేందుకు సహకరించిన టిఎస్ ఐజీ డైరెక్టర్ అర్చన సురేష్, సేల్స్ ఫోర్సెస్ సంస్థ ప్రతినిధి కిరణ్ మ‌యి, నిర్మాణ్ ఎన్జీఓ ప్రతినిధి మధురీ కనకాలకు ధన్యవాదములు తెలిపారు.

విజ్ఞాన్నాన్ని అందించడంలో వార్త పత్రికలు ముందుంటాయని, ప్రతిరోజూ ఒక తెలుగు లేదా ఇంగ్లీష్ వార్త పత్రిక‌ను కనీసం 15నిముషాలు చదవాలని, మీరు చెప్పదలుచుకున్నది ఏ భాషలోనైనా కాన్ఫిడెన్స్ గా చెప్పాలన్నారు. మీరు చెప్పే దానిని బట్టి మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారని విద్యార్థులకు తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో ఎక్కువగా స్టేజ్ మీద మాట్లాడించాలని, విద్యార్థులతో స్టేజ్ మీద మాట్లాడిస్తే వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుందని, విద్యార్థులు కేంద్రంగా విద్యా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సూచించారు. రేపటి నుండి ప్రారంభమవుతున్న 10వ తరగతి పరీక్షల్లో అందరూ పాసై 10జీపీ సాధించాలని విద్యార్థులకు సూచించారు.


తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ డైరెక్టర్ అర్చన సురేష్ మాట్లాడుతూ... జిల్లా కలెక్టర్ త‌మ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ నాలెడ్జ్ అందించేందుకు సహకారం కోరడంతో సేల్స్ ఫోర్సెస్, నిర్మాన్ ఎన్జీఓల సహకారంతో డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, హుస్నాబాద్ ఆర్డీఓ రామ్మూర్తి, కోహెడ తహసీల్దార్ సురేఖ, ప్లానింగ్ అండ్ ఎంఐఎస్ కో ఆర్డినేటర్ రామస్వామి, ఎంఈఓ పద్మయ్య, పాఠశాల హెచ్ఎం, నిర్మాన్, సేల్స్ ఫోర్సెస్ ఆర్గనైజేషన్స్ ప్రతినిధులు కిరణ్ మ‌యి, మాధురి, పాఠశాల, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *