గ్రామ స్థాయి నుంచే కాంగ్రెస్ బలోపేతానికి చర్యలు
కడెం, ఆంధ్రప్రభ: గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో గ్రామ కమిటీల ఏర్పాటు కొనసాగిస్తున్నట్లు కడెం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు గంగన్న తెలిపారు. నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆదేశాల మేరకు బుధవారం కడెం మండలంలోని కొత్త మద్దిపాడగ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా దుల్లే గంగాధర్, ఉపాధ్యక్షులుగా జడ రాజమణి, అంకంపేట గంగన్న, ప్రధాన కార్యదర్శిగా జడ రాజేందర్, కార్యదర్శులుగా బానవత్ ప్రమీల, పూడూరి నర్సయ్య, అధికార ప్రతినిధిగా ముత్యంపేట రాజేష్, కోశాధికారిగా దుర్గం నరేష్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా సోమర్పేట శీను, శసిరిపురం రాజేందర్, బండారి గంగన్నలను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా బొడ్డు గంగన్న మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో గ్రామ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, ఆర్టీఏ సభ్యుడు తుమ్మల మల్లేశ్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి ముడికె మల్లేశ్ యాదవ్, మైనారిటీ సెల్ అధ్యక్షుడు సలీం, బీసీ సెల్ అధ్యక్షుడు ముంజ ప్రసాద్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెంకల శ్రీనివాస్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
