కోతుల బెడద నివారణకు చర్యలు..
కోతుల బెడద నివారణకు చర్యలు..
- మిషన్ భగీరథ ట్యాంక్‌కు మూత ఏర్పాటు
అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట మండలం, మన్నేవారిపల్లి గ్రామానికి స్పెషల్ ఆఫీసర్‌గా విచ్చేసిన డీఈ హేమలత గ్రామంలోని పలు సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారంపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. గ్రామంలో కోతుల సంచారం ఎక్కువగా ఉండటంతో, మూత లేకుండా ఉన్న వాటర్ ట్యాంకుల్లో కోతులు పడిపోయే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని యూపీఎస్ పాఠశాల సమీపంలో ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌కు తప్పనిసరిగా మూత ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఆదేశించారు. డీఈ హేమలత సూచనల మేరకు సిబ్బంది సహకారంతో ట్యాంక్‌పై వెంటనే మూత ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజల భద్రతతో పాటు తాగునీటి పరిశుభ్రత కాపాడేందుకు తీసుకున్న ఈ చర్యను స్థానికులు అభినందించారు. అధికారులు ఇలాగే గ్రామ సమస్యలపై వేగంగా స్పందించాలని గ్రామస్థులు కోరారు.
