మే డే వేడుకలు విజయవంతం చేయాలి

మేడే వేడుకలు విజయవంతం చేయాలి

జిల్లా ఉపాధ్యక్షులు కుటికల శంకర్

జైనూర్, ఆంధ్రప్రభ : మే 1న నిర్వహించే మేడే ఉత్సవాలు విజయవంతం చేయాలని గ్రామీణ పేదల సంఘం కొమరం భీమా జిల్లా ఉపాధ్యక్షులు కు టికల్ శంకర్ అన్నారు. బుధవారం జైనూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో మేడే ఉత్సవాల కరపత్రాలను గ్రామీణ పేదల సంఘం కొమురం భీమ్ అసిఫాబాద్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కుటికెల శంకర్ ఉపాధ్యక్షులు సిడం ధర్ములు నాయకులు విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో సందర్భంగా వారు మాట్లాడుతూ ఐరాపాలో జరిగిన పారిశ్రామిక విప్లవం నుండి ఆధునిక కార్మిక వర్గం ఉద్భవించిందని కొత్త యాంత్రికరణ విష్కరణలతో పోటీ పడలేక పనిగంటలను తగ్గించాలని కార్మిక వర్గం పోరాడిందని మే ఒకటి 1886న అమెరికాలోని చికాగో లో 8 గంటల పని దినాన్ని డిమాండ్ చేస్తూ కార్మికులు నిరసనలు, ఆందోళనలు చేపట్టారని పెట్టుబడిదారి వర్గం ఈ శాంతియుత ప్రదర్శనలపై కాల్పులు జరిపిందని కార్మికులు తూటాలకు బలయ్యారని తిరుగుబాటు నాయకులను ఉరితీసారని కేసులు పెట్టి తీవ్ర అణిచివేతకు పాల్పడ్డారని జైలు శిక్షలు విధించారు ఈ కార్మికుల బలిదానాల రక్త దర్పణులతో మేడే చరిత్ర నిలిచిపోయిందని అన్నారు. ఈ మేడేను అన్ని ప్రాంతాల్లో ఘనంగాజరుపుకోవాలనివారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ డీఎస్ఓ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వాగ్మారే సంబాజి, నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply