ఆత్మహత్యాయత్నం చేసిన వివాహితను రక్షించిన పోలీసులు

ఆత్మహత్యాయత్నం చేసిన వివాహితను రక్షించిన పోలీసులు
బాసర, ఆంధ్రప్రభ: గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ వివాహితను బాసర పోలీసులు సమయోచితంగా స్పందించి రక్షించారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. బాసర మండలం లబ్ది గ్రామానికి చెందిన నికిత షిండే కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురై గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు బాసరకు వచ్చినట్లు సమాచారం అందింది. దీంతో అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆమెను సురక్షితంగా రక్షించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, పోలీస్ స్టేషన్‌లో సీఐ కిరణ్‌కుమార్ కౌన్సెలింగ్ నిర్వహించారు. తరువాత ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
సమయోచితంగా స్పందించి మహిళ ప్రాణాలను కాపాడిన బాసర పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ జానకీ షర్మిళ అభినందించారు.
