గనిలో ప్రమాదం.. కార్మికుడికి తీవ్ర గాయాలు
గనిలో ప్రమాదం.. కార్మికుడికి తీవ్ర గాయాలు
నస్పూర్, ఆంధ్రప్రభ: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే న్యూటెక్ గనిలో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. హాలర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న బి. వంశీకృష్ణ డ్యూటీలో ఉండగా, రూఫ్ డ్రమ్ము నుంచి వచ్చిన మోటర్ కేసింగ్‌కు తగలడంతో మోటర్ డ్రమ్ము పగిలిపోయింది. ఈ ఘటనలో అతని ముఖం, తలకు తీవ్ర గాయాలయ్యాయి.
అతడిని వెంటనే అత్యవసర చికిత్స కోసం రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
