Public Grievance | భారీగా తరలివచ్చిన ఫిర్యాదుదారులు

Public Grievance | పుట్టపర్తి, ఆంధ్రప్రభ : పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. పుట్టపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజవర్గ సమస్యలపై ప్రజా గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు. రెవిన్యూ సమస్యలపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని వీటికి తక్షణం శాశ్వత పరిష్కారం చూపాలని రెవిన్యూ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ గ్రీవెన్స్ కు ఎక్కువుగా రెవిన్యూ పరంగా ఆస్తి వివాదాలు, డ్రైనేజ్ సక్రమంగా లేదని, కొత్త సీసీ రోడ్లు కావాలని నూతన పెన్షన్లు, పక్కా గృహాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డికి పలువురు లబ్ధిదారులు అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply