Kolhapur 1902 | మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను సాధించాలి…

Kolhapur 1902 | మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను సాధించాలి…

Kolhapur 1902 | నల్లబెల్లి, ఆంధ్రప్రభ : జ్యోతిరావు పూలె ఆశయాలను సాధించాలంటే బహుజనులు రాజ్యాధికారంలోకి రావాల‌ని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధానకార్యదర్శి చింతకింది కుమారస్వామి దూషించారు. అగ్రవర్ణ బ్రాహ్మణీయ(upper caste Brahmins) సమాజంలోని అంటరానితనం, వివక్ష, అధిక వడ్డీ దోపిడికీ వ్యతిరేకంగా పోరాడిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను సాధించాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు అధికారంలోకి రావడమేననీ కుమారస్వామి అన్నారు.

మండల కేంద్రమైన నల్లబెల్లిలోని గ్రామ పంచాయతీ ఆవరణలో జ్యోతి రావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘణనివాళి అర్పించిన అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ.. సమాజంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను నిర్మించిన మనువాద బ్రాహ్మణీయ ఆధిపత్య శక్తులు వందల ఏండ్లుగా అస్ప్రుశ్యులు(untouchables)గా, అంటరాని వారిగా గుడికి, బడికి, భూమికి దూరంగా నెట్టేసిన శూద్రుల హక్కుల కోసం జ్యోతి రావు పూలే దంపతులు తమ జీవితాలను త్యాగం చేశారన్నారు.

అగ్రవర్ణ ఆధిపత్య దోపిడి అంతం కావాలంటే శూద్రులు విద్యావంతులు కావడమొక్కటే మార్గమనీ అందుకోసం పాఠశాలలు ఏర్పాటు చేసి మహిళలతో సహా విద్య నేర్పారన్నారు. సాహు మహారాజ్ ద్వారా 1902లోనే కొల్హాపూర్(Kolhapur as early as 1902) సంస్థానంలో 50 శాతం రిజర్వేషన్లు(50 percent reservation) అమలు చేయించారన్నారు. నేటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీలను విద్యకు, వైద్యానికి, ఉపాధికీ దూరం చేసే కుట్రలను అగ్రవర్ణపు ఆధిపత్య రాజకీయ పార్టీలు కొనసాగిస్తున్నారన్నారు.

విద్యా వైద్యం, ప్రభుత్వ రంగాల ప్రైవేటీకరణ చేస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన జరుపుతున్న పాలకుల స్థానంలో బహుజనులు రాజ్యాధికారం సాధించడంతోనే జ్యోతి రావు పూలే ఆశయాలను సాధించినట్టు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పరికి కోర్నేలు, బొట్ల ప్రతాప్, నాగెల్లి ప్రకాష్, సీపీఐ మండల కార్యదర్శి కడియాల క్రాంతి కుమార్, కన్కం ఎల్లయ్య, కాంగ్రెస్ నాయకులు కొండి అశోక్, పొడేటి కిషోర్, సామేల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply