Sensex | సానుకూల సంకేతాలతో మార్కెట్ పరుగులు..
Sensex | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నమోదైన సానుకూల ధోరణి, కొనుగోళ్ల జోరు దేశీయ సూచీలకు ఊతమివ్వడంతో ట్రేడింగ్ ప్రారంభం నుంచే మార్కెట్లు లాభాల బాట పట్టాయి.
ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 694 పాయింట్లు ఎగబాకగా, నిఫ్టీ 197 పాయింట్లు లాభపడింది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆర్థిక, ఆటో, ఐటీ రంగాల షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు బలంగా పుంజుకున్నాయి.
మరోవైపు విదేశీ మారకద్రవ్య మార్కెట్లో రూపాయి కూడా డాలర్‌తో పోలిస్తే 25 పైసలు బలపడి రూ.95.23 వద్ద ట్రేడవుతోంది. రూపాయి బలపడటం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడిదారుల సెంటిమెంట్ సానుకూలంగా ఉండటంతో రోజంతా మార్కెట్లు లాభాల్లో కొనసాగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
