BRS | ‘బోధించు.. సమీకరించు.. పోరాడు’ సిద్ధాంతం అమలు చేశాం

BRS | ‘బోధించు.. సమీకరించు.. పోరాడు’ సిద్ధాంతం అమలు చేశాం
BRS | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అంబేద్కర్ ‘బోధించు.. సమీకరించు.. పోరాడు’ అనే తత్వాన్ని అనుసరించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించారు.
అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, సమాజంలో సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన కృషి అపారమని ఆయన కొనియాడారు.
‘బోధించు.. సమీకరించు.. పోరాడు’ అనే అంబేద్కర్ తత్వం సమాజ మార్పునకు దోహదపడిందని కేటీఆర్ అన్నారు. అదే మార్గాన్ని అనుసరించి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని గుర్తుచేశారు. ప్రజలను సమీకరించి, అందరినీ కలుపుకుని పోరాడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేశారని పేర్కొన్నారు.
అంబేద్కర్ విద్యతోనే సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని చెప్పారని, ఆ దిశగా కేసీఆర్ ప్రభుత్వ కాలంలో పేదల కోసం పెద్ద సంఖ్యలో గురుకులాలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ వంటి నేతల సహకారంతో విద్యా రంగంలో కీలక మార్పులు తీసుకువచ్చామని కేటీఆర్ పేర్కొన్నారు.
