మహిళలకు అన్నిట్లో సముచిత స్థానం కల్పించాలి

మహిళలకు అన్నిట్లో సముచిత స్థానం కల్పించాలి
నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ : నేటి పోటీ ప్రపంచంలో అన్నిట్లో మహిళలకు సముచిత స్థానం కల్పించిన అప్పుడే మహిళలకు గౌరవం ఉంటుందని మహిళా మణులు పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని హైట్రిక్ కౌన్సిలర్ సాదం స్వప్న పేర్కొన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని నటరాజ్ నగర్ కాలనీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది మహిళాశక్తి అని, ఏ పనినైనా ధైర్యంగా చేయాలని, కష్ట, నష్టాలను పోరాటపటిమతో ఎదుర్కొనే శక్తి మహిళలకు ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నల్ల జలజ తదితరులు పాల్గొన్నారు. మహిళా సంఘం నాయకురాలు ఆమెడ వీణ. జ్యోతి తదితరులు తదితరులు పాల్గొన్నారు.
