ఉప్లూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మారుపక నరేష్

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిగా మారుపాక నరేష్‌ను పార్టీ నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మాజీ గ్రామశాఖ అధ్యక్షుడు కొమ్ముల రవీందర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోనగిరి భాస్కర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి ఏలేటి మోహన్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మారుపాక నరేష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. అనంతరం నూతన అధ్యక్షుడికి నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.

అలాగే సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలందించిన మాజీ అధ్యక్షుడు కొమ్ముల రవీందర్ సేవలను నాయకులు కొనియాడారు. ఆయన అనుభవం, సేవలను పార్టీ ఉన్నత స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్, ఉపసర్పంచ్ తక్కురి ముత్యం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తక్కురి దేవేందర్, బద్దం రాజేశ్వర్, బోనగిరి లక్ష్మణ్, బద్దం తిరుపతి రెడ్డి, సుంకరి విజయ్, బద్దం నాగేష్, తక్కురి రాజశేఖర్, దాసరి రాకేష్, సాధుల్లా, శ్రీనివాస్, నవీన్, జక్కుల అనిల్, ఆంజనేయులు, నజీర్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.