భీమ్‌గల్‌లో ఘనంగా రంజాన్ పండగ వేడుకలు

భీమ్‌గల్‌లో ఘనంగా రంజాన్ పండగ వేడుకలు

భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్‌ పటణంతో పాటు మండలంలో బాబాపూర్, పల్లికొండ, బడా భీమ్‌గల్‌, గోనుగోపుల, తోపాటు వివిధ గ్రామాలలో ముస్లిం సోదరులు శనివారం (ఈద్-ఉల్-ఫితర్) రంజాన్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తి, శ్రద్ధలతో ఈద్గా ల వద్ద మత గురువులు ప్రత్యేక సామూహిక ప్రార్థనలు చేశారు. ప్రార్ధన అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఆప్యాయంగా రంజాన్ పండుగ (ఈద్ ముబారక్) తెలుపుకున్నారు.

సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఈద్ ఉల్ ఫితర్ పండుగను భక్తి శ్రద్ధలతో సోదర భావంతో ఘనంగా జరుపుకున్నారు. రంజాన్ నెల ముగిసిన తర్వాత జరుపుకునే ఈ పండుగ ముస్లిం లకు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఒక నెల పాటు రంజాన్ ఉపవాసం చేసిన ఆనంతరం,నెలవంక దర్శనంతో షావ్వల్ మాసం ప్రారంభం అవుతుంది. ఆనెల మొదటి రోజున ఈద్ పండుగను జరుపుకుంటారు.

ఈ రోజు అల్లాకు కృతజ్ఞతలు తెలిపే రోజుగా కూడా భావిస్తారు. రంజాన్ పండుగ సందర్భంగా ఈదుగా కు వచ్చిన మున్సిపల్ చైర్మన్ బీ.నాగమణి స్వామి, వైస్ చైర్మన్ లత నర్సయ్య, వార్డ్ కౌన్సిలర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ముస్లిం సోదరులకు ఒకరినొకరు కలిసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మత గురువులు ముఫ్తి, షౌకత్‌బేగ్, ముఫ్తి, మోసిన్, మౌలానా జమీల్‌, ఆఫీస్ సిరాజ్, అంజుమన్ కమిటీ అధ్యక్షుడు అంజుమ్ అల్లి, మాజీ అంజుమన్ కమిటీ అధ్యక్షుడు తాహెర్ హుస్సేన్,వార్డ్ కౌన్సిలర్లు నీలం, మామరి ప్రతీప్, సంగ్య నాయక్,పర్స అనంతరావు, మాజీ కౌన్సిలర్ సతీష్ గౌడ్,అంజుమన్ కమిటీ సభ్యులు సాహెబ్, జుబేర్, సయ్యద్ హైమద్ అలీ, ఫయాజ్, ఫహీమ్,ఇక్రమ్, గిర్ని మజ్జు, శిబ్బు, అప్సర్, మైనార్టీ యువకులు సయ్యద్ కమల్ పాషా, సయ్యద్ అత్తరుద్దీన్, అఖిల్, మొహమ్మద్ జిషాన, మొహమ్మద్ దానిష్, మజ్జు, సయ్యద్ ఇంతియాజ్,ముంతాజ్, ఇలియాస్, జునేత్, ఫైజాన్, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply