బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో నిజామాబాద్‌కు రన్నరప్

బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో నిజామాబాద్‌కు రన్నరప్

నిజామాబాద్ అర్బన్ (ఆంధ్రప్రభ): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జూన్ 5 నుంచి 7 వరకు నిర్వహించిన 11వ యువ అంతర్‌జిల్లా బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్–2026లో నిజామాబాద్ నగర క్రీడాకారులు విశేష ప్రతిభ కనబర్చి ద్వితీయ స్థానం (రన్నరప్) సాధించారు.

నిజామాబాద్ నగరానికి చెందిన 9వ, 10వ తరగతులు మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని తమ ఆటతీరుతో ప్రశంసలు అందుకున్నారు. కోచ్ పవన్ ఆధ్వర్యంలో కఠిన శిక్షణ పొందిన క్రీడాకారులు జట్టుగా సమన్వయంతో ఆడి ఫైనల్ వరకు చేరుకుని ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన జట్ల మధ్య జరిగిన పోటీల్లో నిజామాబాద్ జట్టు అత్యుత్తమ ప్రతిభను కనబర్చి క్రీడా రంగంలో తమ ప్రత్యేకతను చాటుకుంది. యువ క్రీడాకారుల పట్టుదల, క్రమశిక్షణ, జట్టు భావన విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

ఈ సందర్భంగా జట్టు సభ్యులను, కోచ్ పవన్‌ను క్రీడా ప్రేమికులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రముఖులు అభినందించారు. భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో మరిన్ని విజయాలు సాధించి నిజామాబాద్కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

నిజామాబాద్ యువ క్రీడాకారులు సాధించిన ఈ విజయం జిల్లాలో బాస్కెట్‌బాల్ క్రీడాభివృద్ధికి మరింత ప్రోత్సాహాన్ని అందించిందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.

Leave a Reply