బీజేపీ నేతలపై మానాల మోహన్‌రెడ్డి వ్యాఖ్యలు ఖండనీయం
బీజేపీ నేతలపై మానాల మోహన్‌రెడ్డి వ్యాఖ్యలు ఖండనీయం
- బద్దం రమేష్ రెడ్డి బిజెపి మండల అధ్యక్షులు – కమ్మర్ పల్లి
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : గత రెండు రోజుల క్రితం కమ్మర్ పల్లి మండల కేంద్రంలో రాష్ట్ర యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి బిజెపి నాయకులను ఏక వచనంతో సంబోధిస్తూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బిజెపి మండల అధ్యక్షులు కమ్మర్ పల్లి బద్దం రమేష్ రెడ్డి అన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన స్థాయికి సరికాదని అన్నారు.ఆయన మండల కేంద్రంలో రైతుల గురించి పెట్టినటువంటి మీడియా సమావేశంలో రైతుల గురించి మాట్లాడాల్సింది పోయి బిజెపి నాయకులపై దిగజారుడు రాజకీయాలు చేయడం,పనికిమాలిన రాజకీయ లుచేయడం సరికాదని అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని,రైతుల ప్రభుత్వము అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ కంటే ఎక్కువ మోసం చేస్తుందని అన్నారు.ఓ పక్కన రైతులు బాధపడుతూ ఉంటే వాళ్ల బాధలు పక్కనపెట్టి దిగజారుడు రాజకీయాలు చేయడం ఏంటని ప్రశ్నించారు.మానాల మోహన్ రెడ్డి హుందాతనానికి మారుపేరు అనుకున్నామని కానీ మానాల మోహన్ రెడ్డి పనికిమాలిన నాయకుడు గా మారారని అన్నారు. మానాల మోహన్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు మానుకోకుంటే బిజెపి పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.రైతు సమస్యలపై మాట్లాడకుండా స్వార్ధ రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం రైతులకు మోసం చేస్తూ మొద్దు నిద్ర పోతుంటే రైతు గోస బీజేపీ భరోసా అనే యాత్ర చేపట్టి రైతు సమస్యల పైన పోరాటం చేస్తున్నామని అన్నారు. రైతులకు ఏం భరోసా ఇచ్చారు, రైతులకు రుణమాఫీ ఏమి ఇచ్చారు అనే అంశాల పైన మాట్లాడడానికి మేము సిద్ధం మానల మోహన్ రెడ్డి సిద్ధమైతే ఏ గ్రామానికి వస్తారో రావాలని చెప్పాలని సవాల్ చేశారు. బిజెపి నాయకులను గాని, రైతులను గాని విమర్శించిన అనుచిత వాక్యలు చేసిన గ్రామ గ్రామాన కాంగ్రెస్ నాయకులను అడ్డుకుంటామని హెచ్చరించారు.ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు సతీష్,ప్రధాన కార్యదర్శి సోమ నరేష్,జిల్లా కార్యవర్గ సభ్యులు చింత ప్రవీణ్,బీజేవైఎం మండల అధ్యక్షుడు కొత్తపల్లి గణేష్,కమ్మర్ పల్లి శక్తి కేంద్ర ఇంచార్జ్ లు పోల్కం నవీన్, చింత మణికంఠ సీనియర్ నాయకులు లాచర్ల రాజేందర్,బోగ రామస్వామి, చిలువేరి వినోద్ తదితరులు పాల్గొన్నారు.
