Japan Open | రెండేళ్ల తర్వాత తుది పోరుకు అర్హత

Japan Open | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో చైనా క్రీడాకారిణి చెన్ యుఫెయ్పై విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించింది.

మ్యాచ్ తొలి గేమ్‌ను 21-19తో సొంతం చేసుకున్న సింధు, రెండో గేమ్‌లో 15-10తో ఆధిక్యంలో ఉండగా చెన్ యుఫెయ్ కండరాల గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగింది. దీంతో సింధు విజేతగా నిలిచి ఫైనల్‌లోకి ప్రవేశించింది. జపాన్ ఓపెన్ ఫైనల్‌కు సింధు చేరడం ఆమె కెరీర్‌లో ఇదే తొలిసారి. అలాగే, దాదాపు రెండేళ్ల తర్వాత మరోసారి అంతర్జాతీయ టోర్నీ ఫైనల్‌లో అడుగుపెట్టింది. జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నీ ఫైనల్‌కు చేరిన భారత మహిళా షట్లర్‌గా కూడా సింధు ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆదివారం జరిగే ఫైనల్లో సింధు టైటిల్ కోసం పోటీ పడనుండగా, ఆమె ప్రత్యర్థి ఎవరో మరో సెమీఫైనల్ ఫలితం తర్వాత ఖరారు కానుంది.