Electricity Supply Telangana | విద్యుత్ పంపిణీలో ఆధునిక సాంకేతికత

Electricity Supply Telangana | విద్యుత్ పంపిణీలో ఆధునిక సాంకేతికత

Electricity Supply Telangana | లోపాల గుర్తింపునకు జీఐఎస్ మ్యాపింగ్
స్కాడా నెట్‌వర్క్‌తో వేగవంతమైన సేవలు
విద్యుత్ వ్యవస్థలో పారదర్శకతకు జీఐఎస్
వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా

Electricity Supply Telangana | ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ ప్రతినిధి: విద్యుత్ పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ శ్రీకారం చుట్టింది. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ సమర్థవంతంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను తీర్చిదిద్దే దిశగా జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్)ను రూపొందించింది.

వరంగల్ కేంద్రంగా రాష్ట్రంలోని 18 జిల్లాల్లో విస్తరించిన ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ లోపాలను సులభంగా గుర్తించేందుకు జీఐఎస్ మ్యాపింగ్ చేపట్టింది. ఈ మ్యాపింగ్ ద్వారా విద్యుత్ వ్యవస్థకు సంబంధించిన విద్యుత్ స్తంభాలు, లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్లు వంటి అన్ని వివరాలు భౌగోళిక మ్యాప్‌పై పొందుపరిచారు.

స్కాడా నెట్‌వర్క్ అనుసంధానం చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యలను త్వరితగతిన పునరుద్ధరించడానికి ఈ మ్యాపింగ్ దోహదపడుతుందని ఎన్పీడీసీఎల్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విధానం వల్ల విద్యుత్ లోపాలను సులభంగా గుర్తించే సౌలభ్యం కలుగుతుంది. విద్యుత్ సరఫరా అంతరాయాలను తగ్గించేందుకు జీఐఎస్ దోహదం చేస్తుంది.

ట్రాన్స్‌ఫార్మర్, ఫీడర్ లోడ్ మానిటరింగ్‌లో పారదర్శకత ఏర్పడుతుంది. జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా విద్యుత్‌కు సంబంధించిన డిజిటల్ డేటాబేస్ రూపొందించడంతో పాటు వాటి నిర్వహణ ప్రణాళికలు, మరమ్మతు పనులు మరింత వేగవంతంగా నిర్వహించవచ్చు. ఇప్పటివరకు ఎన్పీడీసీఎల్ పరిధిలో 33 కేవీ ఫీడర్లు, 697 లెవన్ కేవీ ఫీడర్లు, 2,822 జీఐఎస్ మ్యాపింగ్ పూర్తయిందని ఎన్పీడీసీఎల్ సీయండీ Varun Reddy తెలిపారు.

డిస్కం పరిధిలో వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ముందుకు సాగుతున్నామని ఆయన వెల్లడించారు.

Leave a Reply