Lawyer Murder Case | కస్టడీలో నిందితులు

Lawyer Murder Case | కస్టడీలో నిందితులు

Lawyer Murder Case | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన న్యాయవాది ఖాజా మోహిజుద్దీన్ హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నాంపల్లి పోలీసులు మహ్మద్ ఆలం ఖాన్, ముజాహిద్ ఆలం ఖాన్‌లను రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు.

చంచల్‌గూడ జైలు నుంచి వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, న్యాయవాది హత్యకు సుపారీ ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తండ్రీకొడుకులను విచారించనున్నారు. హత్యకు దారితీసిన కారణాలు, కుట్ర వెనుక ఉన్న అంశాలపై ఆరా తీయనున్నారు.

ఈ కేసులో మెహబూబ్ ఆలం ఖాన్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే కేసుకు సంబంధించిన పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుండగా, తాజా కస్టడీతో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఖాజా మోహిజుద్దీన్ హత్య కేసు నగరంలో తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.