Kuntala | ఊరు వాడలో భోగి సంబరాలు

Kuntala | ఊరు వాడలో భోగి సంబరాలు

  • ముత్యాల ముగ్గుల సంబరాలు
  • ముత్యాల ముగ్గులు వేస్తున్న మహిళ

Kuntala | కుంటాల, ఆంధ్రప్రభ : సంక్రాంతి పండుగ సంబరాలను కుంటాల మండల వ్యాప్తంగా బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో భోగి సందడితో ఊరువాడ కళకళలాడింది. భోగి పండుగను పురస్కరించుకొని మహిళలు ఇళ్ళ ముందు వివిధ రకాల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పేర్చి ప్రత్యేక వినూత్నంగా ముగ్గులు అలంకరించడం విశేషంగా ఆకట్టుకుంది. భోగి పండుగను పురస్కరించుకొని వివిధ దేవాలయాలు భక్తులతో సందడి నెలకొనగా, వేకువ జామున పాత వస్తువులు భోగిమంటల్లో వేసి ఆడిపాడుతూ ఈ ఏడాది అన్ని శుభాలు జరగాలని ఆకాంక్షించారు. ముచ్చటగా మూడు రోజులు జరుపుకునే భోగి వేడుకల్లో భాగంగా పల్లెల్లో సంక్రాంతి శోభ ఉట్టి పడినట్లు కళకళలాడుతుంది. వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన ప్రజలు సంక్రాంతి పండగకు సొంత ఊర్లకు చేరుకోవడంతో సంక్రాంతి వేడుకలు వైభవంగా జరుపుకుంటున్నారు. లోగిళ్ళ ముందు మహిళలు వివిధ రకాల రంగులతో రంగవల్లులు, గంగిరెద్దుల విన్యాసాలు చిన్నారుల గాలి పతంగులు ఎగరవేస్తూ వేడుకలు వేడుకగా జరుపుకుంటున్నారు.

Leave a Reply