టైగర్ జోన్ సమస్యలను పరిష్కరించాలి..

  • రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ సెక్రటరీకి వినతి పత్రం అందజేత..
  • ఖానాపూర్ ఎమ్మెల్యే బోజ్జు పటేల్..

జన్నారం, ఆంధ్రప్రభ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, కవ్వాల టైగర్ రిజర్వ్ లోని ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను పరిష్కారంచాలని నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు పటేల్ తెలిపారు. హైదరాబాద్ సచివాలయంలో రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ సెక్రటరీ అహ్మద్ నదీమ్ ని సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే కలిసి వినతిపత్రం ఇచ్చి, సమస్యలను వివరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..అటవీ శాఖ అధికారుల వేధింపులు ఆపాలన్నారు.అనవసర ఆంక్షలను ఎత్తివేసి, ప్రజలకు న్యాయం చేయాలని ఆయన చెప్పారు.టైగర్ రిజర్వ్ పరిధిలోని మండలాల్లో ఎకో సెన్సిటివ్ జోన్ అంశంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలు, అపోహలను నివృత్తి చేస్తూ విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని,రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు,రోడ్ల అభివృద్ధి పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు చేసేందుకు సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు.

రెవెన్యూ డివిజన్ పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ల నిర్వహణకు అటవీ శాఖ నుంచి అనవసర అడ్డంకులు కల్పించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని, నియోజకవర్గ ప్రజల హక్కులు,అభివృద్ధి కార్యక్రమాల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు.

జన్నారంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలి..

జన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను హైదరాబాడ్ లో ఎమ్మెల్యే కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రిలో మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఉట్నూర్,ఇంద్రవెల్లి, కడెం,ఖానాపూర్, పెంబి ప్రభుత్వ ఆసుపత్రుల సమస్యలను పరిష్కరించాలని, ఖాళీలను భర్తీ చేయాలని,నాణ్యమైన వైద్యం అందించాలని ఆయన కోరారు.