జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి పోటీలకు ఇద్దరు విద్యార్థులు ఎంపిక….

జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి పోటీలకు ఇద్దరు విద్యార్థులు ఎంపిక….

దండేపల్లి, ఆంధ్రప్రభ : విద్యార్థులు చదువుతో పాటు క్రీడాలో కూడా ప్రతిభ కనబరుస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. దండేపల్లి మండలంలోని గుడిరేవు ప్రాథమిక పాఠశాలలో 2026-27 సంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో బొమ్మేన అద్విక మొదటి స్థానంలో నిలిచింది, బొంగురాల మాన్వి రెండవ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొలిశెట్టి బుచ్చన్న తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కేవలం చదువు పైన కాకుండా క్రీడాలపై శ్రద్ద చూపడంతో ఉత్సహవంతులుగా తయారవుతారని, వారి మెదడుకు మంచి సంతృప్తినిస్తుందని అన్నారు. విద్యార్థులు ముందుముందు రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయిలో విజయం సాధించింది మంచి పేరు ప్రఖ్యాత లు తీసుకరవాలని కోరారు. అనంతరం పోటీలకు ఎంపికైన విద్యార్థులను అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ స్వరూప ఆధ్వర్యంలో శాలువలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయు రాలు శ్యామల, అంగన్వాడి టీచర్ లక్ష్మి, ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ ధనలక్ష్మి, విద్యార్థులు ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply