ఉపాధి హామీ పనుల్లో నాణ్యతే లక్ష్యం..
ఉపాధి హామీ పనుల్లో నాణ్యతే లక్ష్యం..
అధికారులకు కలెక్టర్ ఆదేశాలు
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలో జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా పనుల పురోగతి, కార్మికుల హాజరు, అమలు విధానంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా సాగుతున్నాయా అనే అంశాన్ని పరిశీలించారు.
నిర్దేశిత లక్ష్యాల మేరకు ఉపాధి హామీ పనులను వేగవంతంగా, నాణ్యతతో కొనసాగించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.
