పారా వాలీబాల్ క్రీడాకారులకు అభినంద‌న‌లు…

పారా వాలీబాల్ క్రీడాకారులకు అభినంద‌న‌లు…

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఇటీవలే ఫిబ్రవరి 25 నుండి 28 వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో నిర్వహించిన పారా వాలీబాల్ ఛాంపియన్‌షిప్–2026లో ఆంధ్రప్రదేశ్ పురుషుల జట్టు స్వర్ణ పతకం సాధించడం జరిగింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని, ఈ రోజు విజయవాడలోని శాప్ ప్రధాన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ పారా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు శివ దత్ , జనరల్ సెక్రటరీ గణేష్ క్రీడాకారులు శాప్ చైర్మన్ రవి నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా రవి నాయుడు మాట్లాడుతూ, ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ పారా క్రీడాకారులు సాధించిన ఈ విజయం వారి అద్భుతమైన పట్టుదల, క్రమశిక్షణకు నిదర్శనమని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యంగా పారా క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం, సదుపాయాలు కల్పించడానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడాకారులకు దేశంలోనే అత్యుత్తమ ప్రోత్సాహకాలు అందిస్తున్నదని తెలిపారు. రానున్న రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచాలని క్రీడాకారులను ప్రోత్సహించారు.