Police | డీసీపీగా బాధ్యతలు చేపట్టిన కవిత

Police | డీసీపీగా బాధ్యతలు చేపట్టిన కవిత

Police |దార కవిత డేరింగ్, డాషింగ్, డైనమిక్ ఆఫీసర్ గా

Police | వరంగల్ క్రైమ్ ఆంధ్రప్రభ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ నూతన డీసీపీగా దార కవిత కవిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా సెంట్రల్ జోన్ పరిధిలోని అధికారులు సిబ్బంది నూతన డీసీపీ కవితను మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చాలను అందజేసి అభినందనలు తెలియజేసారు.

డీసీపీ కవిత హైదరాబాద్ సైబర్ విభాగంలో పని చేస్తూ బదిలీపై సెంట్రల్ జోన్ డీసీపీగా నియమితులయ్యారు. నాన్ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ అయినప్పటికీ కేసులో చేదనలో
తనదైన మార్క్ ను చాటుకొనే అధికారిణిగా గుర్తింపును పొందారు.

Police |సంచలన కేసు దర్యాప్తు…

వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా విధుల్లో చేరిన దార కవిత డేరింగ్, డాషింగ్, డైనమిక్ ఆఫీసర్ గా పేరు గడించారు. దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన ఐ బోమ్మ రవి కేసులో కీలక పాత్ర పోషించారు. ఐ బొమ్మ రవి కేసును డీసీపీ దార కవిత దర్యాప్తు అధికారిగా కొనసాగుతున్న క్రమంలోనే వరంగల్ కు బదిలీ అయ్యారు.

ఐ బొమ్మ రవి కేసును దర్యాప్తు చేస్తున్న కవితను ఇంకా విచారణలో ఉండగానే సదరు అధికారి కవితను ప్రభుత్వం బదిలీ చేసింది. ఐ బొమ్మ రవి కేసు మిస్టరీని ఛేజించడంలో ధార కవిత ప్రధాన పాత్ర పోషించారు. ఐ బొమ్మ రవి కేసు మిస్టరీ కేసు ఇంకా దర్యాప్తు పూర్తి కాక ముందే ఆ కేసు నుండి తప్పించేందుకే సర్కార్ బదిలీ వేటు వేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


వరంగల్ లోని నిట్ లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. కవిత 2010 గ్రూప్-1లో డీఎస్పీగా చేరారు. ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో డీసీపీగా పనిచేస్తున్నారు. కాగా గతంలో శ్రీనివాస్ అనే అధికారిని నియమించినా, చేరేలోగా ఆర్డర్ క్యాన్సిల్ కావడంతో తాజాగా కవితను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

ఇక్కడ పని చేసి బదిలీపై వెళ్లిన షేక్ సలీమా స్థానంలో ధార కవిత నియమితులయ్యారు. ఓరుగల్లు మహానగర పరిడితో పాటు గ్రామీణ నేపథ్యం మిలితమై ఉన్న సెంట్రల్ జోన్ డిసిపిగా కవిత తనదైన వర్క్ స్టైల్ చూపిస్తారని నగర వాసులు ఆశీస్తున్నారు.

Leave a Reply