బడి పిలుస్తుంది… కార్యక్రమంతో పిల్లల చేరికలకు ఊతం

బడి పిలుస్తుంది… కార్యక్రమంతో పిల్లల చేరికలకు ఊతం

కర్నూలు బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : నగర్ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంతాల్లో బడి పిలుస్తుంది కార్యక్రమం భాగంగా గురువారం అవగాహన ర్యాలీ మానవహారం నిర్వహించబడింది. ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి, అర్హత కలిగిన చిన్నారులను ఒకటవ తరగతిలో చేర్పించడం జరగాలని, షరీఫ్ నగర్ ప్రాంతంలో ర్యాలీతోపాటు ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఎల్. సుధాకర్ పాల్గొన్నారు, బడి ఈడు పిల్లలు తప్పనిసరిగా పాఠశాలలో చేరాలని, ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన ప్రతి బాలబాలికలు ప్రభుత్వ పాఠశాలలో చేరాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులతో ప్రత్యక్షంగా మాట్లాడి, పిల్లల చేరికలను ప్రోత్సహించారు.

ఈ కార్యక్రమంలో కల్లూరు మండల విద్యాశాఖ అధికారులు ఎం శ్రీనివాసులు, వనజ కుమారి, అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ రఫీ గారు, కమ్యూనిటీ మొబైల్ చేసిన ఆఫీసర్ డాక్టర్ వై ధనరాజు, ICDS అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply