- ఫిబ్రవరి 11న శ్రీవారి దర్శనం..
తిరుపతి వాసులకు టీటీడీ ఈనెల 11న శ్రీవారి దర్శనం కల్పించనుంది. ఈ మేరకు ఆ దర్శన టికెట్ టోకెన్లను రేపు(ఫిబ్రవరి 9న) జారీ చేయనుంది.
అయితే స్థానికులకు శ్రీవారి దర్శన కోటా కింద ప్రతి నెలా మొదటి మంగళవారం టోకెన్లు జారీ చేస్తుండగా.. ఈ నెలలో రథసప్తమి కారణంగా రెండో మంగళవారానికి టీటీడీ వాయిదా వేడింది.
రేపు తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమలలోని బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో దర్శన టోకెన్లు జారీ చేస్తారు. దర్శనం కోటా టోకెన్లు పొందిన భక్తులకు ఫిబ్రవరి 11న స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు.
అయితే స్థానికులకు శ్రీవారి దర్శన కోటా టోకెన్ల కోసం వచ్చే భక్తులు ఆధార్ కార్డు వెంట తీసుకురావాలని టీటీడీ సూచించింది. అలాగే టోకెన్లు పొందిన తర్వాత దర్శనానికి వచ్చిన సమయంలోనూ ఆధార్ కార్డును వెంట ఉంచుకోవాలని సూచించింది.