నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన పైసా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భామ సిద్ధికా శర్మ. ఆ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించినప్పటికీ, టాలీవుడ్‌లో తను ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌కు పయనం చేసింది.
అయితే అక్కడ కూడా స్టార్‌డమ్ అందుకోలేకపోయిన సిద్ధికా… పంజాబీ మ్యూజిక్ ఆల్బమ్స్‌పై దృష్టి సారించింది. ప్రస్తుతం మ్యూజిక్ వీడియోలతో బిజీగా కెరీర్ కొనసాగిస్తూ ఉంటుంది.
తన నటనతోనే కాదు, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సిద్ధికా.. తన గ్లామర్ ఫోటోషూట్‌లతోనూ తరచూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె షేర్ చేసిన రెబల్ లుక్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్టైలిష్ అవతారంలో హాట్ హాట్ ఫోజులతో కుర్రకారులో హీట్ పెంచేస్తోంది.











