21వ వార్డులో జోరుగా కాంగ్రెస్ ప్రచారం

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి 21వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తోపాజీ వీణా హరీష్ కు మద్దతుగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు తూర్పు జయాచైతన్యరెడ్డి ప్రచారం నిర్వహించారు. తమ నాయకుడు జగ్గారెడ్డి ద్వారా రూ.8 కోట్ల నిధులు వార్డుకు రావాలంటే, చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. ఆమె ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. కాంగ్రెస్ కు ఓటేస్తేనే 21వ వార్డుకు అధిక నిధులు వస్తాయని అన్నారు. ఈ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. తమ మామ తోపాజీ అనంతకిషన్, తన భర్త హరీష్ సేవలకు గుర్తింపుగా తనకు జగ్గారెడ్డి కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చారని వీణా హరీష్ తెలిపారు.
అందువల్ల మీ ఓటును ఆలోచించి వేయాలని, జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని గుర్తుకు తెచ్చుకోవాలని పేర్కొన్నారు. తనకు భారీ మెజార్టీ ఇచ్చి ఆదరించాలని కోరారు. 21వ వార్డులో కాంగ్రెస్ హస్తం గెలిస్తేనే 8 కోట్ల నిధులు వస్తాయని తోపాజీ వీణా హరీష్ అన్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్, యువ నేత హరీష్ గుప్తా, వార్డు పెద్దలు పాల్గొన్నారు. అధికారంలో లేని పార్టీకి ఓటు వేస్తే వృధా అవుతుందని తోపాజీ హరీష్ చెప్పారు. గల్లీలు అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కు ఓటేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
