..రూ.10లక్షల నిత్యావసర సరుకుల పంపిణీ
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : పవిత్ర రంజాన్ మాసంలో కఠిన ఉపవాస దీక్ష చేపట్టే నిరుపేద ముస్లిం కుటుంబాలకు సురభి వైద్య కళాశాల యాజమాన్యం రంజాన్ తోఫా అందజేసింది. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎంబి గార్డెన్స్ లో 10లక్షల రూపాయల నిత్యావసర సరుకులను నిరుపేద ముస్లిం కుటుంబాలకు సురభి వైద్య కళాశాల చైర్మన్ సురభి హరిందర్ రావు, సెక్రెటరీ సురభి మహేందర్ రావులు అందజేశారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… రంజాన్ పవిత్ర మాసంలో నెలరోజుల పాటు ముస్లింలు కఠిన ఉపవాస దీక్ష చేపడతారని, రంజాన్ పవిత్ర పర్వదినం కోసం గత మూడేళ్లుగా నిరుపేదలకు ప్రతి ఏడాది 10లక్షల రూపాయల సరుకులు అందిస్తున్నామన్నారు. ప్రతి వ్యక్తి తాను సంపాదించే దాంట్లో కొంత దానం చేయాలని ఖురాన్ లో రాసి ఉందన్నారు. నిరుపేదలకు సరుకులు అందించిన హరేందర్ రావు, మహేందర్ రావులను పెద్దపల్లి మైనార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. వీరిని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, నిరుపేదలకు ఏదో విధంగా సాయం చేసేందుకు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు ఎంఏ హమీద్, మసూద్, హాది, జావీద్, అలీం, మతిన్, సజ్జాద్, ముస్తాక్, సోడా బాబుతో పాటు పలువురు పాల్గొన్నారు.