కనకదుర్గమ్మకు రికార్డు స్తాయి ఆదాయం..

  • భవాని ఇరుముడుల సందర్భంగా రూ.4.50 కోట్ల ఆదాయం..
  • విలువైన బంగారం వెండి బహుకరణ..
  • స్వదేశీతో పాటు విదేశీ డాలర్లు విరాళం..

ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : ఇంద్రకీలాద్రిపైని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఈటీవీ ద్వారా నిర్వహించిన భవాని దీక్షల విరమణ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున కానుకలను సమర్పించారు. దీక్షల కార్యక్రమం ఈ నెల 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు కొనసాగగా, ఈ మేరకు ఆలయ హుండీలను బుధవారం, గురువారం ఆలయ అధికారులు లెక్కించారు.

మహా ప్రాంగణం 6వ అంతస్తులోని హుండీల లెక్కింపులో బుధవారం నగదు రూ.1,27,90,645, బంగారం 0.18 గ్రాములు, వెండి 2.474 గ్రాములు లభించాయి. గురువారం జరిగిన లెక్కింపులో రెండో రోజు రూ. 3,21,22,542 నగదు, 0.200 గ్రాముల బంగారం, 14.850 గ్రాముల వెండిని సమర్పించారు.

రెండు రోజుల మొత్తం లెక్కింపులో, రూ. 4,49,13,187 నగదు, 0.218 గ్రాముల బంగారం, 17.324 గ్రాముల వెండిని భక్తులు విరాళంగా ఇచ్చారు. వీటితోపాటు పని దేశాలకు చెందిన విదేశీ డాలర్లు కూడా భక్తులు కానుకల రూపంలో అమ్మవారికి సమర్పించారు. ఈ హుండీల లెక్కింపును ఆలయ ఈవో శీనా నాయక్, దుర్గగుడి పాలకమండలి చైర్మన్ బొర్రా గాంధీ పర్యవేక్షణలో నిర్వహించారు.