CASE | ఫోన్ లొకేషన్‌తో పట్టుకున్న పోలీసులు

CASE | ఫోన్ లొకేషన్‌తో పట్టుకున్న పోలీసులు
CASE | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ప్రముఖ సినీ నటులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో అనుదీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోన్ లొకేషన్ ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవల ఓ షోలో పవన్ కళ్యాణ్, నిహారిక, ఎన్టీఆర్, రామ్ చరణ్, బాలకృష్ణలపై కామెడీ పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేసిన అనుదీప్‌ను కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు.
తన కుటుంబాన్ని కలవడానికి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లిన అనుదీప్‌ను ఏప్రిల్ 14న సాయంత్రం 7 గంటల సమయంలో పార్కులో తండ్రితో ఉన్నప్పుడే పోలీసులు ఫోన్ లొకేషన్ ట్రేస్ చేసి అదుపులోకి తీసుకున్నారు. కాకినాడలోని జనసేన పార్టీ నాయకుడు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేసి పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అనుదీప్‌ను విచారిస్తున్నట్లు సమాచారం.
