Warm welcome | గవర్నర్‌కు ఘన స్వాగతం

Warm welcome | గుంటూరు కలెక్టరేట్, ఆంధ్రప్రభ : గుంటూరు జిల్లా పెదనందిపాడుకు శుక్రవారం విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌కు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా.బూర్ల రామాంజనేయులు ఘన స్వాగతం పలికారు. పెదనందిపాడులో సుప్రీమ్ కోర్టు విశ్రాంత న్యాయమూర్తి లావు నాగేశ్వర రావు గృహానికి సతీసమేతంగా ఆయ‌న వ‌చ్చారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, డీఎస్పీ భానోదయ తదితరులు పాల్గొన్నారు.

Warm welcome
Warm welcome

Leave a Reply