brsparty | ఉమ్మడి రంగారెడ్డి నేతలతో కేటీఆర్ భేటీ

brsparty | ఉమ్మడి రంగారెడ్డి నేతలతో కేటీఆర్ భేటీ
brsparty | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసంలో నిర్వహించిన ఈ భేటీలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యాచరణపై కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. రానున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, గ్రామస్థాయి నుంచి పార్టీ కమిటీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. స్థానిక సంస్థలైన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మంచి విజయాలు సాధించిన పార్టీ నేతలను కేటీఆర్ అభినందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని, వాటిని ప్రజా సమస్యలతో అనుసంధానం చేస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
