Judiciary | న్యాయవాది పై దాడిని ఖండిస్తూ విధుల బహిష్కరణ
Judiciary | న్యాయవాది పై దాడిని ఖండిస్తూ విధుల బహిష్కరణ
- న్యాయవాదుల రక్షణ చట్టం తక్షణ అమలు చేయాలి..
- జగ్గయ్యపేట బార్ అసోసియేషన్
Judiciary | జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : బంటుమిల్లి బార్ అసోసియేషన్(Bar Association) న్యాయవాది అంగర రంగనాధ్‌పై జరిగిన పాశవిక దాడిని తీవ్రంగా ఖండిస్తూ, జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఈ రోజు కోర్టు విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నెపాగ సుందరరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ… న్యాయవాదులపై జరుగుతున్న దాడులు న్యాయవ్యవస్థ(Judiciary) పునాదులను దెబ్బతీసేవని ఆందోళన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో న్యాయవాదుల భద్రతను కాపాడేందుకు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో జూనెబోయిన శ్రీనివాసరావు, గోనెల వెంకటేశ్వర్లు, టి.ఎల్. నరసింహరావు, ఎం. ఆంజనేయులు, రావూరి ప్రసాద్, పి. నాగరాజు, గోనుగుంట్ల శ్రీనివాస్ గౌడ్, దాసరి వెంకట కృష్ణ, గురువులు రాజు, చిన్న గాంధీ, రాజశేఖర్, నరేష్, అంకమ రాజు, శేష కుమారి తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.
