గ్యాస్ కొరత ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే

గ్యాస్ కొరత ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే
- సామాన్యుడికి గుదిబండల గ్యాస్ బండ
- ప్రజలకు అందుబాటులో గ్యాస్ సిలిండర్లు ఉండేలా చూడాలి
- గ్యాస్ డీలర్లు గ్యాస్ కొరత స్పృష్టిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు
- తెలంగాణ ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మంథని, ఆంధప్రభ : ప్రపంచంలో జరుగుతున్న యుద్ధం పరిణామాల దృష్ట్యా గ్యాస్ కొరత ఏర్పడిందని, గ్యాస్ కొరత ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని తెలంగాణ ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం మంథని పట్టణం పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా గ్యాస్ బండ సామాన్యుడికి గుడిబండల మారిందని తెలిపారు.
యుద్ధ వాతావరణం ఏర్పడిన సందర్భంలో గ్యాస్ కొరత ఏర్పడిందని, సామాన్యుడికి గ్యాస్ బండ అందేలా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని పేర్కొన్నారు. గ్యాస్ ఏజెన్సీ డీలర్లు గ్యాస్ సిలిండర్లను బ్లాక్ లో విక్రయించినట్లు తెలిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సామాన్యుడికి అందుబాటులో గ్యాస్ సిలిండర్లు ఉండేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ కొరత లేకుండా ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.
ఇప్పటికే గ్యాస్ నిలువల గురించి పౌరసరఫల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశామని, సామాన్యుడికి అందుబాటులో సిలిండర్ ఉండేలా చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్యాస్ విలువల గురించి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వివరిస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత ప్రధాని మోడీ గ్యాస్ సరఫరా గురించి తక్షణమే స్పందించాలని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
దేశంలో ప్రస్తుతం గ్యాస్ నిల్వలు ఎన్ని ఉన్నాయి, ఇంకా ఎన్ని రోజులకు సరిపడా ఉంటాయి అనే విషయం కేంద్ర ప్రభుత్వం ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉందని మంత్రి తెలిపారు. ముడి చమురు నిలువల గురించి కూడా కేంద్ర ప్రభుత్వం వివరించాలని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి గ్యాస్ సరఫరా, ముడి చమురు సరఫరా గురించి కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు వివరాలు తెలుపుతున్న మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రానికి ఎలాంటి కొరత కలుగకుండా సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న, మండల పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి సభ్యులు, న్యాయవాది శశిభూషణ్ కాచే, నాయకులు సేగ్గం రాజేష్, మంథని సత్యం, సోషల్ మీడియా ఇన్ఛార్జి ఆరేళ్ళి కిరణ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
