వడదెబ్బ వలనే..

వడదెబ్బ వలనే..


ఉట్నూర్ రూరల్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణంలోని శాంతినగర్ కు చెందిన బిరుదుల కిరణ్ కుమార్ (38) కు వడదెబ్బ తగిలి ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు మృతుని అన్న బిరుదుల లాజర్ తెలిపారు. తన తమ్ముడు కిరణ్ కుమార్ సోమవారం సిమెంట్ రోడ్డు నిర్మాణానికి మిల్లర్ కూలీ పనికి వెళ్లి పనులు చేస్తుండగా మధ్యాహ్నం స్పృహ కోల్పోయి కింద పడిపోవడంతో వాంతులు చేసుకున్నాడన్నారు.. వెంటనే ఉట్నూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయించామన్నారు. వైద్యుల సూచన మేరకు ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ కి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని ఆయన తెలిపారు. తన తమ్మునికి 5 సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని.. పిల్లలు లేరని భార్య ఉందని ఆయన తెలిపారు.

Leave a Reply