Hyd Crime | హత్యపై పోలీసుల దర్యాప్తు
Hyd Crime | హత్యపై పోలీసుల దర్యాప్తు
Hyd Crime | ఆంధ్రప్రభ, హైదరాబాద్: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలుకానగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉండగా, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో చిలుకానగర్ ప్రాంతంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
