యువకుడి ఆత్మహత్యకు కారణం ఇదే..

యువకుడి ఆత్మహత్యకు కారణం ఇదే..
ధర్మసాగర్, ఆంధ్రప్రభ : ధర్మసాగర్ గ్రామానికి చెందిన చట్ల మహేష్ గౌడ్ ఆత్మహత్యాయత్నం అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం ఆర్థిక ఇబ్బందులు, లోన్ అప్ ల వేధింపులు తట్టుకోలేక, ఈఎంఐల ఒత్తిడితో ఆయన ఇటీవల పురుగుల మందు తాగినట్లు తెలిసింది. వెంటనే కుటుంబ సభ్యులు వరంగల్లోని ఎంజీఎమ్ ఆసుపత్రికి తరలించగా, గత కొద్ది రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి కన్నుమూశారు. మహేష్ మృతికి కారణమైన బ్యాంకు పై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
