దారుణం.. ఒంటరి మహిళపై అన్నదమ్ముల అఘాయిత్యం

దారుణం.. ఒంటరి మహిళపై అన్నదమ్ముల అఘాయిత్యం

నకరికల్లు, ఆంధ్రప్రభ: పల్నాడు జిల్లా నకరికల్లు మండల పరిధిలోని చేజర్ల గ్రామ శివారులో దారుణ ఘటన చోటుచేసుకుంది. పొలాల వద్ద ఒంటరిగా ఉన్న మహిళపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేగింది.

సత్తెనపల్లి రూరల్ సీఐ కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. చేజర్ల గ్రామ శివారులోని పొలాల వద్ద ఓ మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన కొత్తపల్లి సుధాకర్, అతని సోదరుడు శ్రీను ఆమెపై దౌర్జన్యానికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు నకరికల్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనపై నకరికల్లు సబ్‌ ఇన్‌స్పెక్టర్ తక్షణమే స్పందించి నిందితులపై కేసు నమోదు చేశారు. సత్తెనపల్లి రూరల్ సీఐ కిరణ్ ఆధ్వర్యంలో దర్యాప్తు వేగవంతం చేశారు. గురువారం ఉదయం సీఐ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ క్లూస్ బృందాన్ని రప్పించి ఘటనా స్థలంలో కీలక ఆధారాలను సేకరించారు. బాధితురాలితో పాటు ప్రత్యక్ష సాక్షులు, స్థానికులను పోలీసులు విచారించి వివరాలు సేకరించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

నిందితులు కొత్తపల్లి సుధాకర్, శ్రీనులపై కఠిన చట్టాల కింద కేసు నమోదు చేశామని, పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply