iran-america-talks-key-stage – 3105 కీల‌క ద‌శ‌లో ఇరాన్-అమెరికా చర్చలు

చర్చలు విఫలమైతే సైనిక చర్య తప్పదన్న అమెరికా
ఇరాన్‌పై ఒత్తిడి పెంచుతున్న ట్రంప్ ప్రభుత్వం
దౌత్య ప్రక్రియకు ట్రంప్ ద్రోహం చేశారన్న ఇరాన్ ఆరోపణ
అణు ఒప్పందంపై కొనసాగుతున్న ప్రతిష్ఠంభన
మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు
కాల్పుల విరమణ పొడిగింపుపై అమెరికా కీలక నిర్ణయం
ఇరాన్-అమెరికా సంబంధాల్లో పెరుగుతున్న ఉద్రిక్తత
ప్రపంచ దేశాల దృష్టి ఇరాన్ చర్చలపైనే
చర్చలు సఫలమవుతాయా?

Iran–US talks - crucial stage

iran-america-talks-key-stage- 3105 ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌, అంత‌ర్జాతీయం : ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఇరాన్‌-అమెరికా మ‌ధ్య యుద్ధం ఆగేటట్టు క‌నిపించ‌డం లేదు. కీల‌క ద‌శ‌లో ఉన్న చ‌ర్చ‌లు స‌ఫ‌లీకృతం అవుతాయా? సైనిక ఘ‌ర్ష‌ణ త‌ప్ప‌దా? అని ప్ర‌పంచ దేశాలు చ‌ర్చించుకుంటున్నాయి. ఇందుకు కార‌ణం లేక‌పోలేదు. అమెరికా రక్షణ మంత్రి పెటే హెగ్సెత్ ( Pete Hegseth) మాట్లాడుతూ, ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు విఫలమైతే అమెరికా మళ్లీ సైనిక దాడులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని హెచ్చరించారు.

iran-america-talks-key-stage – 3105 అణు ఒప్పందంపై కొనసాగుతున్న ప్రతిష్ఠంభన
ఇరాన్‌-అమెరికా మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ‌లు ఆశాజ‌న‌కంగా క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే ఆమెరికా ష‌ర‌త‌లు అంగీక‌రిండానికి ఇరాన్ సుముఖంగా లేదు. అయితే కాల్పుల విర‌మ‌ణ అర‌వై రోజులు పొడిగించే ప్ర‌తిపాద‌నపై చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి. అణు ఒప్పందంపై ప్రతిష్ఠంభన కొన‌సాగుతుంది. అణు ఒప్పందంపైనే చ‌ర్చ‌లు తీరుగుతున్నాయి. శాంతి ఒప్పందం కుదిరితే ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థకు ఊరట లభించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కానీ ప్ర‌స్తుతం ఉద్రిక్త‌తల నేప‌థ్యంలో ఇప్ప‌ట్లో యుద్ధం ఆగేట‌ట్లు క‌నిపించ‌డం లేద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.

Iran–US talks - crucial stage

iran-america-talks-key-stage – 3105 హోర్ముజ్ లో అనుమానాస్పద మైన్ కలకలం
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ, హోర్ముజ్ జలసంధిలో అనుమానాస్పద తేలియాడే మైన్ కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. నౌకాదారులు, మత్స్యకారులు, సముద్ర మార్గాన్ని వినియోగించే వారందరికీ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఒమన్ సముద్ర భద్రతా కేంద్రం హెచ్చరించింది. ఒమన్ ప్రాదేశిక జలాల్లోని హోర్ముజ్ జలసంధి ఇన్‌షోర్ ట్రాఫిక్ జోన్‌కు పశ్చిమంగా తేలియాడుతున్న అనుమానాస్పద వస్తువు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆ వస్తువుకు సురక్షిత దూరం పాటించాలని, అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

Iran–US talks - crucial stage

iran-america-talks-key-stage – 3105 దౌత్య ప్ర‌క్రియ‌కు ట్రంప్ ద్రోహం : ఇరాన్‌
దౌత్య ప్ర‌క్రియ‌కు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ద్రోహం చేస్తున్నార‌ని ఇరాన్ సుప్రీం నేత సలహాదారు మొహ్సెన్ రెజాయీ అన్నారు. సముద్ర దిగ్బంధనాన్ని కొనసాగిస్తూ, అధిక డిమాండ్లు చేస్తూ ట్రంప్ మూడోసారి దౌత్య ప్రక్రియకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు.

Iran–US talks - crucial stage

iran-america-talks-key-stage- 3105 కాల్పుల విరమణ పొడిగింపుపై త్వ‌ర‌లో నిర్ణయం
ఇరాన్‌తో అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో 60 రోజుల పాటు పొడిగించే ప్రతిపాదనపై త్వరలో తుది నిర్ణయం తీసుకుంటానని ట్రంప్ ప్రకటించారు. ఏప్రిల్ ప్రారంభంలో కుదిరిన తాత్కాలిక సంధిని పొడిగించడం ద్వారా శాశ్వత శాంతి ఒప్పందం కోసం చర్చలకు మరింత సమయం లభిస్తుందని పేర్కొన్నారు. వైట్ హౌస్‌లోని ప్రత్యేక భద్రతా గదిలో జరిగిన సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. అయితే ట్రంప్ తుది నిర్ణయం తీసుకున్నారా లేదా అన్న విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. దీనిపై త్వ‌ర‌లో నిర్ణ‌యం తీసుకుంటార‌ని అధికారులు తెలిపారు.

Also Read యుద్ధం.. విద్వంసం

iran-america-talks-key-stage – 3105 ఇవే అమెరికా విధించిన ష‌ర‌తులు..
ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు గానీ, అణుబాంబు గానీ కలిగి ఉండకూడదని ట్రంప్ స్పష్టం చేశారు. అలాగే హోర్ముజ్ జలసంధిలో రెండు దిశల్లోనూ ఎలాంటి టోల్‌లు లేకుండా అంతర్జాతీయ నౌకాయానం నిర్బంధం లేకుండా కొనసాగాలని డిమాండ్ చేశారు. “ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు తయారు చేయబోమని అంగీకరించాలి. హోర్ముజ్ జలసంధి వెంటనే పూర్తిగా తెరవాలి” అని ట్రంప్ పేర్కొన్నారు.

Also Read యుద్ధ‌మా? శాంతా?

iran-america-talks-key-stage- 3105 హోర్ముజ్ నిర్వహణపై నిర్ణయం ఇరాన్, ఒమన్ ల‌ది!
ఒప్పందం కుదిరే దశలోనే ఉందని ఇరాన్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించినప్పటికీ, ఇంకా అధికారిక ఆమోదం లభించలేదని తెలిపారు. అయితే అణు కార్యక్రమం, హోర్ముజ్ జలసంధిపై నియంత్రణ వంటి అంశాలపై ఇంకా ఇరాన్ అంగీకారం తెలపలేదని సమాచారం. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ, హోర్ముజ్ జలసంధి నిర్వహణపై నిర్ణయం ఇరాన్, ఒమన్ కలిసి తీసుకోవాల్సిన విషయమని అన్నారు.

iran-america-talks-key-stage – 3105 ఒప్పందంలో ఏముంది?
అమెరికా ఇరాన్ నౌకలపై విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే, తమ షరతుల మేరకు హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ సిద్ధంగా ఉంది. అలాగే ఇరాన్‌కు చెందిన సుమారు 12 బిలియన్ డాలర్ల స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేసే అంశంపైనా అంగీకారం కుదిరినట్లు సమాచారం. అయితే “తదుపరి ప్రకటన వచ్చే వరకు ఎలాంటి నిధుల మార్పిడి జరగదు” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Also Read అందానికి వ‌ర్ణం అడ్డుకాదు

Leave a Reply