బందరు రూరల్ లో వికసించిన విద్యా కుసుమం…..

బందరు రూరల్ లో వికసించిన విద్యా కుసుమం…..

మచిలీపట్నం, ఆంద్ర‌ప్ర‌భ : మచిలీపట్నం రూరల్ చిన్నాపురం గ్రామంలో నిరక్షరాస్య రైతు కుటుంబంలో కుటుంబంలో పుట్టి పదవ తరగతిలో 600 కు గాను 591 మార్కులు సాధించిన విద్యార్థిని అక్షయను లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు సోమవారం ఘనంగా సన్మానించారు. సోమవారం జగన్నాధపురం లంకిశెట్టి కార్యాలయంలో సన్మాన కార్యక్రమం జరిగింది. విజేతకు నూతన దుస్తులు అందజేశారు.

పదవ తరగతి 10 వ తరగతి పరీక్షలలో 591/600 మార్కులు సాధించిన చిన్నాపురం కి చెందిన నూకల పున్నారావు , నిర్మల కుమార్తె నూకల అక్షయ లక్ష్మి ని సన్మానించిన న్యాయవాది లంకిశెట్టి బాలాజీ ఫ్రెండ్స్ సర్కిల్. ప్రతిభకు పేదరికం అడ్డు కాదని గ్రామీణ ప్రాంతంలో పెట్టిన అత్యధిక మార్కులు సాధించి తల్లిదండ్రుల ఆశయానికి కృషి చేసిన అక్షయ అభినందనలు అని న్యాయవాది లంకి శెట్టి బాలాజీ అన్నారు.