ipl gt vs csk| నేడు గుజ‌రాత్‌, చెన్నై ఢీ

ipl gt vs csk| నేడు గుజ‌రాత్‌, చెన్నై ఢీ

టాప్ ప్లేస్ కోసం ఒక‌రు.. ప‌రువు కోస‌మ మ‌రొక‌రు
అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్‌
రాత్రి 7.30 గంట‌ల‌కు ఢీకొన‌నున్నాయి.
ప్లేఆఫ్స్ ఆశ‌లు వ‌దులుకున్న చెన్నై
టాప్ ప్లేస్ కోసం గుజ‌రాత్ ఫైట్‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ లీగ్ దశ క్లైమాక్స్ చేరుకుంది. ఇవాళ గుజ‌రాత్‌, చెన్నై జ‌ట్లు అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7.30 గంట‌ల‌కు ఢీకొన‌నున్నాయి. గాయాల సమస్యలు, నిలకడలేని బౌలింగ్‌తో చెన్నై సతమతమవుతుంటే, గుజరాత్ మాత్రం అన్ని విభాగాల్లో సమతూకంగా కనిపిస్తోంది. ఒకరికి టాప్-2 స్థానం, మరొకరికి పరువు పోరాటం కావడంతో ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన వినోదాన్ని పంచడం ఖాయం. అయితే గుజ‌రాత్ ఇప్ప‌టికే ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. టేబుల్‌లో రెండో స్థానంలో ఉంది. ఇక చెన్నై ప్లేఆఫ్స్ చేరుకునే చాన్స్‌ దాదాపు కోల్పోయింది. అయితే గుజ‌రాత్ మాత్రం టేబుల్ టాప‌ర్‌గా నిల‌వ‌డానికి ఈ మ్యాచు చాలా కీల‌కం. ఇందులో మంచి ర‌న్‌రేట్‌తో గెలిస్తే టేబుల్ టాప్‌కు వెళ్లే అవ‌కాశం ఉంటుంది.

వరుస ఓటములతో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ పరువు నిలుపుకోవాలని చూస్తోంది. ఒక‌వేళ ఈ మ్యాచులో చెన్నై గెలిస్తే ఇత‌ర జ‌ట్ల జ‌య‌ప‌జ‌యాల మీద ఆధారంతో ప్లేఆఫ్స్‌కు చేరినా చేర‌వ‌చ్చు.

టేబుల్ టాప్ కోసం తీవ్ర పోటీ నెల‌కొంది. ప్రస్తుతం 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్, టేబుల్ టాపర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 పాయింట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ 16 పాయింట్లతో ఉన్నాయి. ప్రస్తుతం గుజరాత్ నెట్ రన్ రేట్ (+0.400) హైదరాబాద్ (+0.350) కంటే మెరుగ్గా ఉంది.

గుజరాత్ జ‌ట్టు టాప్ ఆర్డ‌ర్ అద్భుత ఫామ్‌లో ఉంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఓపెనర్ సాయి సుదర్శన్ రాణిస్తుండ‌టం శుభ‌ప‌రిణామం. అయితే మిడిలార్డ‌ర్ మాత్రం కొంచెం వీక్‌గా ఉంది. బౌలింగ్‌లో గుజరాత్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కీల‌కం. ఇత‌న్ని ఎదుర్కోవడం చెన్నై బ్యాటర్లకు సవాలే అని చెప్ప‌వ‌చ్చు. చెన్నై జ‌ట్టులో సంజూ శాంస‌న్ కీల‌క బ్యాట‌ర్ అత‌ను రానిస్తే చెన్నై ఈజీగా గెలుస్తుంది.

ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య రికార్డులు 4-4తో సమంగా ఉన్నాయి. కానీ, ఇటీవలి కాలంలో గుజరాత్ హవా నడుస్తోంది. ఈ సీజన్ మొదటి భాగంలో చెన్నైను వారి సొంత మైదానంలోనే గుజరాత్ 8 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడించింది.