జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల పంపిణీ

వికారాబాద్, ఆంధ్రప్రభ : 2026-2028 సంవత్సరానికి సంబంధించిన అక్రిడేషన్ కార్డులను వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి జర్నలిస్టులకు అందజేశారు. జిల్లా డీపీఆర్వో చెన్నమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ పత్రికలకు చెందిన జర్నలిస్టులు అక్రిడేషన్ కార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు శెట్టి రవిశంకర్, అల్లిపురం వెంకటేష్, కుమ్మరి రాఘవేందర్, మల్లేశం తదితరులతో పాటు అడిషనల్ పీఆర్‌వో ప్రభాకర్ పాల్గొన్నారు.

Leave a Reply